కరోనా బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు రూ.59.30 లక్షల సాయం

ABN , First Publish Date - 2020-07-27T22:28:44+05:30 IST

తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు 59.30 లక్షల రూపాయల ఆర్దిక సాయం అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు.

కరోనా బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు రూ.59.30 లక్షల సాయం

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన 337 మంది జర్నలిస్టులకు 59.30 లక్షల రూపాయల ఆర్దిక సాయం అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో పాజిటివ్‌వచ్చిన 256 మంది జర్నలిస్టులకు 20వేల చొప్పున 51.20 లక్షల రూపాయలు, హోమ్‌క్వారంటైన్‌లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు 10వేల చొప్పున 8.10లక్షల రూపాయలు సాయంగా అందించామని తెలిపారు. సోమవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షల నిర్వహించగా తాజాగా 72 మందికి పాజిటివ్‌వచ్చిందని, మరో నలుగురు జర్నలిస్టులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు సూచించినట్టు తెలిపారు. 


ఇలా 761మంది జర్నలిస్టులకు 14లక్షల 80వేల రూపాయల ఆర్ధిక సాయం జర్నలిస్టుల అక్కౌంట్‌లలో జమచేసినట్టు తెలిపారు. జర్నలిస్టు మిత్రులు తమ వివరాలుు తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ వాట్సప్‌ నెంబర్‌ 8096677444 పంపాలని అన్నారు. అలాగే మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్‌ లక్ష్మణ్‌కుమార్‌ సెల్‌ నెం. 9676647807 కు సంప్రదించ వచ్చని అన్నారు. కరోనా బారిన పడిన పాజిటివ్‌, క్వారంటైన్‌జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్‌ రిపోర్టులు మీడియాఅకాడమీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. 

Updated Date - 2020-07-27T22:28:44+05:30 IST