కొవిడ్‌ బాధిత జర్నలిస్టులకు 3.12 కోట్ల సాయం

ABN , First Publish Date - 2020-10-24T08:31:29+05:30 IST

కొవిడ్‌ బాధిత జర్నలిస్టులకు 3.12 కోట్ల సాయం

కొవిడ్‌ బాధిత జర్నలిస్టులకు 3.12 కోట్ల సాయం

మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ


రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన 1,603 మంది జర్నలిస్టులకు రూ.3.12 కోట్ల ఆర్థిక సాయం అందించామని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన 1,517 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున రూ.3.3 కోట్లు, ప్రైమరీ కాంటాక్ట్‌తో హోం క్వారంటైన్‌లో ఉన్న 86 మందికి రూ.10వేల చొప్పున రూ.8.60 లక్షల ఆర్థిక సహాయం అందించామని వివరించారు. జర్నలిస్టులకు మీడియా అకాడమీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. కొవిడ్‌ బారిన పడిన జర్నలిస్ట్‌ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్‌ వాట్సాప్‌ నంబరు 80966 77444కి పంపాలని, మరిన్ని వివరాలకు అకాడమీ మేనేజర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ నంబరు 96766 47807ను సంప్రదించవచ్చని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి వచ్చిన రూ.9 కోట్ల వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించామని చెప్పారు.

Updated Date - 2020-10-24T08:31:29+05:30 IST