కరోనా సోకిన జర్నలిస్టుల వివరాల్విండి

ABN , First Publish Date - 2020-06-16T09:59:22+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులు ఆర్థిక సాయం కోసం

కరోనా సోకిన జర్నలిస్టుల వివరాల్విండి

  • మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ 

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న జర్నలిస్టులు ఆర్థిక సాయం కోసం వివరాలను పంపాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ కోరారు. కరోనా సోకిన జర్నలిస్టులకు తక్షణ సాయం కింద రూ.20 వేలు, క్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టుకు రూ.10వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు.  కాగా, హెల్త్‌ కార్డులున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అనుమతించిన అన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీయూడబ్లూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్‌, ప్రధాన కార్యదర్శి కె.విరహత్‌ అలీ సోమవారం డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-06-16T09:59:22+05:30 IST