మేడారంలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2020-12-21T04:18:14+05:30 IST

మేడారంలో భక్తుల కోలాహలం

మేడారంలో భక్తుల కోలాహలం
సమ్మక్క తల్లిని దర్శించుకుంటున్న భక్తులు

మేడారం, డిసెంబరు 20: తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. దూరప్రాంతాల నుంచి సుమారు 20వేల మంది భక్తులు వాహనాల్లో మేడారం చేరుకున్నారు. ముందుగా జంపన్నవాగులో స్నానాలు చేసి తలనీలాలు సమర్పించుకున్నారు. అక్కడి నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దెలకు చేరుకుని పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం), కొబ్బరి కాయలు, పూలు, పండ్లు, చీర, గాజులు, సారె సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో మేడారం వీధుల్లో సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - 2020-12-21T04:18:14+05:30 IST