అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా

ABN , First Publish Date - 2020-02-08T21:05:35+05:30 IST

తెలంగాణ కుంభమేళా గిరిజన జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ముండా శనివారం విచ్చేశారు.

అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా

 తెలంగాణ కుంభమేళా గిరిజన జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ముండా శనివారం విచ్చేశారు. ఆయనతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా జాతరకు వచ్చారు. ఈసందర్భంగా వారికి రాష్ట్ర స్ర్తీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పలికి అమ్మవార్ల దర్శనం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని, మేడారం అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని కోరుతూ కేంద్ర మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. జాతర ప్రాముఖ్యతను కూడా రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రికి వివరించారు. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసినట్టు మంత్రులు వివరించారు. రెండు సంవత్సరాలకోసారి జరిగే జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. జాతరను జాతీయ హోదా కల్పించేందుకు  కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి అనేక సార్లు విన్నవించడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో పలు సార్లు ముఖ్యమంత్రులతో పాటు ప్రభుత్వపరంగా కూడా విన్నవించినట్టు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు అవసరం లేదని, సమ్మక్క, సారలమ్మ దేవతల విశిష్టత ప్రాముఖ్యత ఉన్నతిని పెంచేందుకు మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నట్టు తెలిపారు. గతంలో కూడా కోరినుట్ట కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.  అనంతరం పోచంపల్లి కండువాలు, శాలువాలు కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈసందర్భంగా వారి వెంట ఎమ్మెల్యే సీతక్క, అధికారులు పాల్గొన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవాలనే జాతీయ హోదాకోరాం

మేడారంలో జరిగే గిరిజన జాతరకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవాలనే లక్ష్యంతోనే జాతీయ హోదా ఇవ్వాలని కోరుతున్నట్టు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ కేంద్ర మంత్రి అర్జున్‌ ముండాను కోరారు. కేంద్ర మంత్రి సమక్క,సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, గురిజన శాఖ కమిషనర్‌ క్రిస్టినా, ఐజి నాగిరెడ్డి, వరంగల్‌ రేంజ్‌ డిఐజి  ప్రమోద్‌కుమార్‌, తల్లుల గద్దెలను దర్శించుకున్నారు.  

Updated Date - 2020-02-08T21:05:35+05:30 IST