మెదక్: గుండెపోటుతో హెడ్ ‌కానిస్టేబుల్ మృతి

ABN , First Publish Date - 2020-05-30T16:25:20+05:30 IST

మెదక్: గుండెపోటుతో హెడ్ ‌కానిస్టేబుల్ మృతి

మెదక్: గుండెపోటుతో హెడ్ ‌కానిస్టేబుల్ మృతి

మెదక్: జిల్లాలోని చేగుంట పోలీస్ స్టేషన్‌‌లో విధులు నిర్వహిస్తున్నహెడ్ కానిస్టేబుల్  శ్రీనివాస్ రెడ్డి (54) గుండెపోటుతో మృతి చెందాడు. గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట. మృతునికి భార్య శివమ్మ, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

Updated Date - 2020-05-30T16:25:20+05:30 IST