రెడ్‌జోన్లలోనూ మెకానిక్‌ షాపులు

ABN , First Publish Date - 2020-05-17T08:39:53+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మినహాయింపులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి వేటిని అనుమతిస్తారో? వేటిని అనుమతించరో? పేర్కొంటూ

రెడ్‌జోన్లలోనూ మెకానిక్‌ షాపులు

మినహాయింపులపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం


హైద రాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మినహాయింపులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి వేటిని అనుమతిస్తారో? వేటిని అనుమతించరో? పేర్కొంటూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారంరెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర పురపాలక సంస్థల పరిధిలో ఉన్న రెడ్‌జోన్లలోనూ ఆటోమొబైల్‌ షోరూంలు, స్పేర్‌పార్ట్స్‌ దుకాణాలు, గ్యారేజీలు తెరుచుకోనున్నాయి. 


అనుమతినిచ్చేవి

నిత్యావసరాలు, నిర్మాణ సామగ్రి, హార్డ్‌వేర్‌, వ్యవసాయ పంపుసెట్ల షాపులు, ఆటోమొబైల్‌ షోరూమ్‌లు, మెకానిక్‌ షాపులు, ఏసీలు, ఫ్యాన్లు, వైద్య పరికరాల దుకాణాలు తెరవచ్చు. హోటళ్లు, లాడ్జిల్లో పోలీసులు, అధికారుల బసకు అనుమతి.


అనుమతి లేనివి

విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, ట్రైనింగ్‌ సెంటర్లు, హోటళ్లు, లాడ్జిలు, బార్లు, పబ్‌లు, సినిమాహాళ్లు, థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఆడిటోరియం, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, రెస్టారెంట్లు, సెలూన్లు, స్పాలు తెరుచుకోవు. 

ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రజలు గుమికూడటం నిషేధం. రాజకీయ, సామాజిక, స్పోర్ట్స్‌, సాంస్కతిక కార్యక్రమాలకు అనుమతి లేదు. క్యాబ్‌లు, ఆటో రిక్షాలను అనుమతించరు. మెట్రో రైళ్లు నడవవు.

Updated Date - 2020-05-17T08:39:53+05:30 IST