విద్యార్థుల భవిష్యత్తు, భద్రతకు చర్యలు

ABN , First Publish Date - 2020-09-06T08:43:50+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తు, భద్రతకు చర్యలు

విద్యార్థుల భవిష్యత్తు, భద్రతకు చర్యలు

హోంమంత్రి మహమూద్‌ అలీ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల భవిష్యత్తు, భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. అగ్నిమాపక విభాగం నుంచి కళాశాలలకు ఎన్‌ఓసీ జారీ చేయాల్సిన అంశాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హోంమంత్రి  కార్యాలయంలో శనివారం సమావేశమై చర్చించారు. ఇంటర్‌ బోర్డు పరిధిలోని కళాశాలలకు అగ్నిమాపక శాఖ అనుమతులు, పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా  నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, డీజీ ఫైర్‌ సర్వీసెస్‌ సంజయ్‌ కుమార్‌ జైన్‌,  ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాతి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-09-06T08:43:50+05:30 IST