వరంగల్‌లో కరోనా కట్టడికి చర్యలు

ABN , First Publish Date - 2020-04-05T17:47:56+05:30 IST

కరోనా వైరస్ కేసులు వరంగల్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి.

వరంగల్‌లో కరోనా కట్టడికి చర్యలు

వరంగల్: కరోనా వైరస్ కేసులు వరంగల్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. భారీగా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడిని అడ్డుకునేందుకు వరంగల్‌లో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. సీపీ రవీందర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి.. మొత్తం అధికారయంత్రాంగమంతా చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


ఈ సందర్బంగా వరంగల్ సీపీ రవీందర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా పాజిటీవ్ వచ్చిన ప్రాంతాల్లో ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సోడియం హైపో క్లోరైడ్‌ను స్ప్రే చేస్తున్నారని, వారు బయటకు రాకుండా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నామని సీపీ తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం మంచిదని.. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-05T17:47:56+05:30 IST