మానుకోట డీపీవోగా రఘువరణ్
ABN , First Publish Date - 2020-12-31T05:09:51+05:30 IST
మానుకోట డీపీవోగా రఘువరణ్
మహబూబాబాద్ రూరల్, డిసెంబరు 30 : మహబూబాబాద్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎం.రఘువరణ్ బదిలీపై వస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాల పంచాయతీ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న లతను జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేయగా కరీంనగర్‌లో పనిచేస్తున్న ఎం.రఘువరణ్‌ను మహబూబాబాద్ డీపీవోగా బదిలీ చేశారు.