వరంగల్: కరోనా నియంత్రణకు మేయర్ ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2020-04-07T20:15:57+05:30 IST

రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వరంగల్ మేయర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.

వరంగల్: కరోనా నియంత్రణకు మేయర్ ప్రత్యేక చర్యలు

వరంగల్: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు వరంగల్ మేయర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్యాలయానికి వచ్చినవారు బయట కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి వేళ్లాలా ఏర్పాటు చేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుభ్రపరిచే చర్యలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేయర్ ప్రకాష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కాశిబుగ్గలో డ్రోన్స్ ద్వారా సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో 15 ప్రాంతాలను నో మూమెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు. ఈ 15 ప్రాంతాల్లో ప్రజలు పూర్తి స్థాయిలో బయటకు రాకుండా నియంత్రించామన్నారు. వారికి నిత్యావసర వస్తులు అందజేస్తున్నామని మేయర్ తెలిపారు.

Read more