మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి కృష్ణా నీరు

ABN , First Publish Date - 2020-08-23T03:31:43+05:30 IST

జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలోకి కృష్ణానది వరద నీరు లీకవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడంతో ప్రొటెక్షన్ వాల్ నుంచి నీరు లీక్

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి కృష్ణా నీరు

సూర్యాపేట : జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలోకి కృష్ణానది వరద నీరు లీకవుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీరు చేరడంతో ప్రొటెక్షన్ వాల్ నుంచి నీరు లీక్ అవుతోంది. కాగా, గతేడాది కృష్ణానదికి వచ్చిన భారీ వరదల్లో ఆలయం నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు కూడా వరదలు భారీగా వస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నుంచి మరమ్మతులు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆలయ పూజారులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నదీ తీరాలలో స్వయంభువుగా వెలసిన పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా మట్టపల్లి ఆలయానికి గుర్తింపు ఉంది.

Updated Date - 2020-08-23T03:31:43+05:30 IST