ప్రభుత్వ లాంఛనాలతో ‘మాతంగి’ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2020-09-03T10:34:42+05:30 IST
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అంత్యక్రియలు బుధవారం పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ

గోదావరిఖని, సెప్టెంబర్ 2: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య అంత్యక్రియలు బుధవారం పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రామగుండం మేయర్ అనీల్‌కుమార్, పలువురు జిల్లా అధికారులు, నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు మాతంగి నర్సయ్య గృహంలో ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.