ఉచితంగా మాస్కులు

ABN , First Publish Date - 2020-04-12T09:23:52+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ ఉన్నా, లేకున్నా

ఉచితంగా మాస్కులు

  • పంచాయతీలే ప్రజలకు పంచాలి
  • కొనుగోలుకు ప్రభుత్వ ఆదేశం


హైదరాబాద్‌, భీంపూర్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడిలో భాగంగా మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ ఉన్నా, లేకున్నా మరికొంత కాలం మాస్కులు తప్పనిసరని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దీంతో మాస్కుల్లేకుండా ఎవరూ బయటకు రావొద్దన్న నిబంధన తెచ్చారు. ఇళ్లకు పరిమితమైన వారు కూడా వీటిని వినియోగించేలా అందరికీ మాస్కులివ్వాలని భావిస్తున్నారు. కొరత నేపథ్యంలో.. మాస్కుల తయారీ, కొనుగోలు, పంపిణీ బాధ్యత లను స్థానిక సంస్థలకు అప్పగించనున్నారు. ఉచిత పంపిణీ కోసం పంచాయతీలు, మునిసిపాలిటీలు మాస్కులను కొనుగోలు చేయాలి. స్థానికంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల(ఎ్‌సహెచ్‌జీ)లతో వీటిని తయారు చేయించి, ఒక్కో మాస్కుకు రూ.15 చెల్లించి, వారి నుంచి సేకరించాలి. వాటిని తమ పరిఽధిలోని ప్రజలందరికీ (2011 జనాభా లెక్కల ప్రకారం) ఉచితంగా అందించాలి. ఈ బాధ్యతను పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్‌, మెప్మాలకు అప్పగించారు. మొత్తం 3కోట్ల పైచిలుకు మాస్కులను తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ధర రూ.50 కోట్లుగా ఉంటుందని అంచనావేసింది. కాగా.. కరోనా కట్టడిలో ముం దున్న రెవెన్యూ శాఖ సామాజిక సేవలోనూ పాలు పంచుకుంటోంది. వీఆర్వోల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. ప్రతి వీఆర్వో కనీసం 100 మంది పేదలకు ఉచితంగా మాస్కులు అందించాలని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గరికె ఉపేంద్రరావు, హరాలే సుధాకర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ట్రెసా) ఆధ్వర్యంలో సంగారెడ్డిలో 1,500 మందికి నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి గ్రామ అంగన్‌వాడీ టీచర్లు రెంగనివార్‌ సునీత, డి.వెంకటమ్మ సొంతంగా మాస్కులు కుట్టి.. వాటిని ఉచితంగా ఇస్తున్నారు.

Updated Date - 2020-04-12T09:23:52+05:30 IST