అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్‌లో ఆశీర్వాదం

ABN , First Publish Date - 2020-04-21T11:53:48+05:30 IST

అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్‌లో ఆశీర్వాదం

అమెరికాలో పెళ్లి.. ఆన్‌లైన్‌లో ఆశీర్వాదం

ఖమ్మం: కరోనా ప్రభావంతో కన్న కొడుకు పెళ్లిని సైతం ఆ తల్లిదండ్రులు వీక్షించలేకపోయారు. చివరకు ఆన్‌లైన్‌లో వీక్షించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అమెరికాలో ఈ నెల 17 జరిగిన వివాహం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఖమ్మం నగరానికి చెందిన సీనియర్‌ అడ్వకేట్‌, జాతీయ బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ స్వామి రమేష్‌ రెండవ కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.   అతనికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన అమెరికా సెటిలర్స్‌ కుటుంబంలోని అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఇంకేం అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్న ఆ కుటుంబాలకు అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభించడం మూలాన అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు అక్కడకు వెళ్లలేక పోగా, అక్కడ పెళ్లి తంతులో పది మందికంటే ఎక్కువగా  ఉండరాదనే నిబంధనతో తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆన్‌లైన్‌లో పెళ్లి చూస్తూ లక్షింతలు వేసి ఆశీర్వదించారు. కేవలం పది మంది బంధుమిత్రుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం పసుపుకొమ్ముతో తాళిని వధువు మెడలో కట్టడంతో పెళ్లితంతు పూర్తయింది.

Updated Date - 2020-04-21T11:53:48+05:30 IST