తలసానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: శశిధర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-07T19:28:26+05:30 IST

గత ఏడాది గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని..

తలసానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: శశిధర్‌రెడ్డి

హైదరాబాద్: గత ఏడాది గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ సారి టీఆర్ఎస్ ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా...ఓటర్లను నమోదు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఈ విషయాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఫేక్ సర్టిఫికేట్లను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి తలసానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని శశిధర్‌రెడ్డి చెప్పారు.

Read more