ఈసీకి మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-11-03T07:34:05+05:30 IST
దుబ్బాకలో టీఆర్‌ఎస్, బీజేపీలు భారీ మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): దుబ్బాకలో టీఆర్‌ఎస్, బీజేపీలు భారీ మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాకు టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిథర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. ఆ రెండు పార్టీలూ నగదు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేయకుండా వాహనాల తనిఖీ నిర్వహించాలని కోరారు.