అక్రమ కట్టడాలు కూల్చడంలో ప్రభుత్వం వెనకడగు: మర్రి శశిధర్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-11-03T21:01:51+05:30 IST
నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చడంలో ప్రభుత్వం వెనకడగు వేస్తోందని..
హైదరాబాద్: నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చడంలో ప్రభుత్వం వెనకడగు వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ హైదరాబాద్ వ్యాప్తంగా 28 వేల అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ గుర్తించిందన్నారు. 2016లోనే అక్రమ కట్టడాలు కూల్చితే ఇంత కష్టం వచ్చేది కాదన్నారు. బుద్ధభవన్ లాంటి ప్రభుత్వ భవనాలు సైతం నాలాలపై ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాలపై నిందలు వేయకుండా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. కేటీఆర్ ఎంతో చేస్తారని ఊహించానని.. ఆయన పనితీరు నిరుత్సాహపరిచిందన్నారు. సుందరీకరణ మాత్రమే నగర అభివృద్ధి కాదన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు చేయాలని మర్రి శశిధర్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.