మార్చ్‌ టు మిలియన్‌

ABN , First Publish Date - 2020-11-13T08:33:27+05:30 IST

కృత్రిమ మేధ(ఏఐ)లో రాష్ట్రంలోని 10 లక్షల మంది(మిలియన్‌) యువతకు 2021 నాటికల్లా నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్‌,

మార్చ్‌ టు మిలియన్‌

10లక్షల మందికి ‘కృత్రిమ మేధ’లో నైపుణ్యాభివృద్ధి

మైక్రోసాఫ్ట్‌, నాస్కామ్‌లతో టాస్క్‌, ఉన్నత విద్యా మండలి జట్టు

 స్మార్ట్‌ టెక్నాలజీతోనే మరింత  ఉత్పాదకత: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ(ఏఐ)లో రాష్ట్రంలోని 10 లక్షల మంది(మిలియన్‌) యువతకు 2021 నాటికల్లా నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్‌, నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌తో టాస్క్‌, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి  గురువారం ఒప్పందం చేసుకున్నాయి. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా, మైక్రోసాఫ్ట్‌ నేషనల్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రోహిణీ శ్రీవాస్తవ, నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ కో-ఆర్కిటెక్ట్‌ అమిత్‌ అగర్వాల్‌ల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.


‘మార్చ్‌ టు మిలియన్‌’ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. నవంబరు 23 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయా సంస్థల అధికారులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ప్రస్తుతం ఐటీ తదితర రంగాలు వివిధ సమస్యల పరిష్కారానికి స్మార్ట్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. స్మార్ట్‌ టెక్నాలజీలో తెలంగాణ యువత నైపుణ్యం సాధించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు.


ఈ అవకాశాన్ని రాష్ట్ర యువత వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కోర్సులో భాగంగా సెల్ఫ్‌ లెర్నింగ్‌ మాడ్యూల్స్‌, వర్క్‌షా్‌పలు, డెమోలు, వర్చువల్‌ క్లాసులు ఉంటాయని టాస్క్‌ సీఈఓ శ్రీకాంత్‌ సిన్హా వివరించారు. మొదటి దశలో 30వేల మందికి శిక్షణ ఇస్తామని పాపిరెడ్డి తెలిపారు.


Updated Date - 2020-11-13T08:33:27+05:30 IST