టీఆర్‌ఎ్‌సకు మరాఠా సమాజ్‌, పీఆర్‌టీయూ మద్దతు

ABN , First Publish Date - 2020-11-25T07:59:50+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర మరాఠా సమాజ్‌ ప్రకటించింది. ఈ

టీఆర్‌ఎ్‌సకు మరాఠా సమాజ్‌, పీఆర్‌టీయూ మద్దతు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర మరాఠా సమాజ్‌ ప్రకటించింది. ఈ మేరకు మరాఠా సమాజ్‌ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను మంగళవారం కలిసి తీర్మాన ప్రతిని అందజేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరాఠా సమాజ్‌కు చెందిన 3 లక్షల మంది ఓటర్లున్నారని సమాజ్‌ నేతలు తెలిపారు.


అలాగే, రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ, 9 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించినందున గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మద్దతు ప్రకటిస్తున్నట్టు ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌(పీఆర్‌టీయూ-టీఎ్‌స) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల్లో  టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తున్నట్లు ఉత్తరాది వ్యాపార ప్రతినిధులు తెలిపారు.  


Read more