సొంత నాయకుడిని హతమార్చిన మావోయిస్టులు
ABN , First Publish Date - 2020-10-03T10:03:48+05:30 IST
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు డివిజన్ స్థాయి కేడర్‌కు చెందిన తమ పార్టీ నాయకుడినే

ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన
దుమ్ముగూడెం, అక్టోబరు 2: ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు డివిజన్ స్థాయి కేడర్‌కు చెందిన తమ పార్టీ నాయకుడినే గురువారం రాత్రి హతమార్చారు. గంగలూరు మావోయిస్టు ఏరియా కమాండర్ మొడియం విజ్జా (43) అలియాస్ భద్రును గంగలూరు-కిరాండుల్ అటవీప్రాంతంలో తుపాకితో కాల్చివేసి గురువారం అర్ధరాత్రి అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారని తెలుస్తోంది. ఆ తర్వాత అతడి స్వగ్రామమైన మన్‌కేలీ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారని సమాచారం. ఈ విషయాన్ని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ ధ్రువీకరించారు.