కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పోస్టర్ల కలకలం
ABN , First Publish Date - 2020-12-16T00:51:59+05:30 IST
కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృషించాయి.

కుమ్రం భీం: కాగజ్‌నగర్‌లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తు మావోయిస్టులు పోస్టర్లను విడుదల చేశారు. కొత్త రెవెన్యూ చట్టాలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని.. ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని ఈ పోస్టర్లలో హెచ్చరించారు. దీంతో స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పోస్టర్లను తొలగించారు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.