ఆ ఎన్‌కౌంటర్ బూటకం: మావోయిస్టు పార్టీ
ABN , First Publish Date - 2020-10-21T10:06:25+05:30 IST
ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మగుట్ట వద్ద ఈ నెల 18న పోలీసులు చేసినవి బూటకపు ఎదురుకాల్పులని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మగుట్ట వద్ద ఈ నెల 18న పోలీసులు చేసినవి బూటకపు ఎదురుకాల్పులని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. జయశంకర్-భూపాలపల్లి, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి(జేఎండబ్య్లూపీ) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మంగళవారం ఒక ప్రకటన ఇచ్చింది. హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, హైకోర్టు ద్వారా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. పౌర హక్కులను కాలరాస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లను కొనసాగిస్తోందన్నారు.