మావోయిస్టు నేతలు దామోదర్‌, రాజిరెడ్డి లక్ష్యంగా కూంబింగ్‌

ABN , First Publish Date - 2020-09-06T01:03:49+05:30 IST

సరిహద్దుల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి రీ ఎంట్రీ ఇచ్చారనే సమాచారంతో పోలీసులు రెండు నెలలు గా భారీ ఎత్తున కూంబింగ్‌లు చేపడుతున్నారు.

మావోయిస్టు నేతలు దామోదర్‌, రాజిరెడ్డి లక్ష్యంగా కూంబింగ్‌

వరంగల్: సరిహద్దుల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి రీ ఎంట్రీ ఇచ్చారనే సమాచారంతో పోలీసులు రెండు నెలలు గా భారీ ఎత్తున కూంబింగ్‌లు చేపడుతున్నారు. గోదా వరి పరీవాహక ప్రాంతాల్లోని అడవుల్లోనే మావోయి స్టులు తలదాచుకొని ఉంటారని భావిస్తూ ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే జూలై 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని మణుగూరు ఏరి యాలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకా ల్పులు జరిగాయి. ఆ సంఘటనలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పది మందికి పైగా మావోయిస్టులు తప్పించుకపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. మణుగూరు నుంచి ములుగు జిల్లా మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, భూపాలపల్లి జి ల్లా పలిమెల, మహదేవపూర్‌, మహముత్తారం అడవుల్లోకి మావోయిస్టులు పారిపోయినట్టు నిఘా వర్గాల సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా ములుగు జిల్లా సరిహద్దులోని గుండాల మండలం అడవుల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందటం పరిస్థితి ఎరుపెక్కింది.

Updated Date - 2020-09-06T01:03:49+05:30 IST