లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

ABN , First Publish Date - 2020-03-18T10:26:38+05:30 IST

మావోయిస్టు దళ సభ్యుడు మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. పాల్వంచలో ఓఎస్‌డీ రమణారెడ్డి వివరాలను...

లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు

పాల్వంచ రూరల్‌, మార్చి 17: మావోయిస్టు దళ సభ్యుడు మంగళవారం భద్రాద్రి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. పాల్వంచలో ఓఎస్‌డీ రమణారెడ్డి వివరాలను వెళ్లడించారు. మావోయిస్టు పార్టీ దళ సభ్యుడైన మడివి దేవ అలియాస్‌ రవి చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నాడు. 2014లో అతడు బాలబాలికల దళంలో చేరాడు. 2015లో ఎల్‌ఓఎస్‌ లో దళ సభ్యుడిగా చేరాడు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు.జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయాడు.

Updated Date - 2020-03-18T10:26:38+05:30 IST