షరతులతో పలు వర్సిటీల డిగ్రీలు చెల్లుబాటు
ABN , First Publish Date - 2020-12-15T08:54:08+05:30 IST
దేశంలోని పలు యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీల విషయంలో, వాటి ఆధారంగా ఇవ్వాల్సిన పదోన్నతులు, నియామకాలపై ట్రాన్స్‌కో స్పష్టతనిచ్చింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని జేఆర్‌ఎన్ రాజస్థాన్ విద్యాపీఠ్,

పదోన్నతులపై ట్రాన్స్‌కో ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పలు యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీల విషయంలో, వాటి ఆధారంగా ఇవ్వాల్సిన పదోన్నతులు, నియామకాలపై ట్రాన్స్‌కో స్పష్టతనిచ్చింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని జేఆర్‌ఎన్ రాజస్థాన్ విద్యాపీఠ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, యూపీలోని అలహాబాద్ అగ్రికల్చరల్ సంస్థ, తమిళనాడు సేలంలోని వినాయక మిషన్ రిసెర్చ్ ఫౌండేషన్‌లలో సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని, 2001-05 విద్యా సంవత్సరంలో చేరి... 2018 జూన్/డిసెంబరులో జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి పదోన్నతులకు అర్హత కల్పించింది.
ఇక 2001-2005 తర్వాతి విద్యా సంవత్సరంలో చేరిన వారు తీసుకున్న డిగ్రీలు చెల్లుబాటు కావని తెలిపింది. సంస్థ నుంచి ఎన్‌వోసీ తీసుకుని ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో)లో 2009-10 విద్యాసంవత్సరంలో చేరి.. బీటెక్, డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి సర్వీసు ప్రయోజనాలతో పాటు నియామకాలు, పదోన్నతుల్లో అవకాశం ఇచ్చారు.
ఇక సంస్థ నుంచి ఎన్‌వోసీ తీసుకుని 2010-2011, 2011-2012 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, డిప్లొమాలు పొందిన వారికి కూడా పదోన్నతులు, నియామకాల్లో చెల్లుబాటు అవుతాయని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.