ప్రజలు వరదల్లో చిక్కుకొని బాధలు పడుతున్నారు: మనిక్కమ్ ఠాగూర్

ABN , First Publish Date - 2020-10-19T18:10:44+05:30 IST

హైదరాబాద్: హైద్రాబాద్‌లో ప్రజలు ఇటీవల వరదల్లో చిక్కుకొని బాధలు పడుతున్నారని ఏఐసీసీ ఇన్‌చార్జి మనిక్కమ్ ఠాగూర్ తెలిపారు.

ప్రజలు వరదల్లో చిక్కుకొని బాధలు పడుతున్నారు: మనిక్కమ్ ఠాగూర్

హైదరాబాద్: హైద్రాబాద్‌లో ప్రజలు ఇటీవల వరదల్లో చిక్కుకొని బాధలు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మనిక్కమ్ ఠాగూర్ తెలిపారు. వరదల్లో చనిపోయిన వారికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధల్లో ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలను నమ్ముకుంటుంది. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ మూల సిద్ధాంతమన్నారు. పక్క వారిని ప్రేమించడం, గౌరవించడం మన సంప్రదాయమని మనిక్కమ్ ఠాగూర్ పేర్కొన్నారు.


రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వ్యక్తులతో పని చేసిన నాయకులతో తాను పని చేయడం నాకు గర్వాంగా ఉందన్నారు. ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు రాబోయే జనరేషన్ గురించి ఆలోచించారన్నారు. ఇప్పుడున్న ప్రధాన మంత్రులు రాబోయే ఎన్నికల గురించి, ఈవిఎంల గురించి ఆలోచిస్తారన్నారు. రాజీవ్ గాంధీ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ  కూడా రాబోయే 30 ఏళ్ల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారని మనిక్కమ్ ఠాగూర్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-19T18:10:44+05:30 IST