నేడు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్న ఠాగూర్
ABN , First Publish Date - 2020-12-10T15:55:39+05:30 IST
వరుస ఓటములతో టీపీసీసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు.

హైదరాబాద్: వరుస ఓటములతో టీపీసీసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ నూతన సారధి ఎవరైతే బాగుంటుందన్నదానిపై అభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొత్త సారధి కోసం టీపీసీసీ వేట ప్రారంభించింది. అందులోభాగంగా గురువారం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ భేటీ కానున్నారు. పీసీసీ అభ్యర్థిత్వంపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే టీపీసీసీ కోర్ కమిటీ సభ్యులు, పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతోనే అభిప్రాయ సేకరణను మాణిక్కం ఠాగూర్ ప్రారంభించారు. బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్ కమిటీ, పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో ఠాగూర్ సమావేశయ్యారు. టీపీసీసీకి నూతన సారధిగా ఎవరైతే బాగుంటుందన్నదానిపై అర్ధరాత్రి దాకా అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది.