గాంధీ భవన్‌కు ఠాగూర్.. పీసీసీపై అభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2020-12-11T17:38:59+05:30 IST

టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడే నేతల సంఖ్య రోజురోజుకూ ఎక్కువైపోతోంది.

గాంధీ భవన్‌కు ఠాగూర్.. పీసీసీపై అభిప్రాయ సేకరణ

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీ పడే నేతల సంఖ్య రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు మీడియా మీట్‌లు పెట్టి తానంటే తాను రేసులో ఉన్నానంటూ వెల్లడించారు. అయితే ఎక్కువ మంది ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డిలకే మద్దతిస్తున్నారు. వీరిద్దరిలోనే ఎవరో ఒకరికి పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకూ విస్తృతంగా అభిప్రాయాలను సేకరించే పనిలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ బిజిబిజీగా గడుపుతున్నారు.


ఇప్పటి వరకు 65 మంది అభిప్రాయాలను తీసుకున్న ఆయన.. ఇవాళ మరికొందరితో గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఇవాళ వీరి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ఎవరిని అధ్యక్షుడిగా నియమించినా అసంతృప్తులు వెల్లువెత్తకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటోంది. విస్తృతంగా అభిప్రాయాలు సేకరించిన మీదట మెజార్టీ నేతల మనోగతాన్ని పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. నాలుగు లేదా ఐదు రోజుల్లో పీసీసీ ఎవరిస్తుందన్నది తేలిపోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Updated Date - 2020-12-11T17:38:59+05:30 IST