మద్యం మత్తులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-17T12:05:11+05:30 IST

మద్యం మత్తులో ఓ యువకుడు చెట్టుకు

మద్యం మత్తులో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్/తిరుమలగిరి : మద్యం మత్తులో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..విష్ణురేఖ, ఆల్బర్ట్‌లు భార్యాభర్తలు. కూలి పనులు చేసుకుంటూ న్యూ గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు లాజర్‌(21) కూలి పనిచేయగా వచ్చిన డబ్బులతో ఫుల్‌గా మద్యం తాగొచ్చి తల్లిదండ్రులతో గొడవ పడతాడు. ఇదే క్రమంలో ఆధివారం ఉదయం ఫుల్‌గా మద్యం తాగొచ్చి తండ్రి ఆల్బర్ట్‌తో గొడవపడేవాడు. తండ్రి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్నాని ఒక కర్టెన్‌ తీసుకుని వెళ్లాడు.


గతంలో కూడా ఇలానే బయటి కెళ్లి తిరిగొచ్చేవాడు. రాత్రివరకు రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం న్యూ గాంధీనగర్‌ పక్కనే ఆంధ్రబ్యాంక్‌ సీజ్‌ చేసిన స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి కర్టెన్‌తో ఉరి వేసుకుని ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థలానికి చేరుకుని పరిశీలించారు. లాజర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2020-12-17T12:05:11+05:30 IST