మంచిర్యాల: 22 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-07-20T12:56:35+05:30 IST

మంచిర్యాల: 22 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ

మంచిర్యాల: 22 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ

డీసీఎస్‌ఓ వెంకటేశ్వర్లు

మంచిర్యాల: నిరుపేదలకు పభ్రుత్వం అందిస్తున్న 10 కిలోల ఉచిత రేషన్‌ బియ్యం ఈనెల 22వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2లక్షల 43వేల మంది తెల్లరేషన్‌ కార్డులు కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 2కిలోల కందిపప్పు ఉచితంగా ప్రభుత్వం అందిస్తోందని, రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకోవాలని కోరారు. దుకాణాల వద్ద విధిగా శానిటైజర్‌, డ్రమ్‌లలో నీరు, డెటాల్‌ అందుబాటులో ఉంచాలన్నారు. రేషన్‌ బియ్యాన్ని అమ్మినా కొన్నా ఇద్దరిని నేరస్తుల కింద పరిగణించి కేసులు నమోదు చేస్తామరన్నారు. బియ్యం పంపిణీ తేదీని పొడిగించిన సందర్భంగా అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-07-20T12:56:35+05:30 IST