మంచిర్యాలలో భారీ వర్షాలు...పొంగుతున్న వాగులు
ABN , First Publish Date - 2020-08-20T16:06:36+05:30 IST
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.

మంచిర్యాల: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వేమనపల్లి, కోటపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కన్నెపల్లి మండలం సాలిగాంకు ఎర్రవాగు వరద ముప్పు పొంచి ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద ఉధృతితో ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.