మంచిర్యాలలో తొలి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-22T14:04:05+05:30 IST
జిల్లా కేంద్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఓ చికెన్ సెంటర్ యజమాని తండ్రికి(65) కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఓ చికెన్ సెంటర్ యజమాని తండ్రికి(65) కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ సమయంలోనే అతనికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో తొలి కరోనా కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అతనితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు.