ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-06-22T09:00:31+05:30 IST
ఫాదర్స్ డే రోజే తండ్రి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిల్‌పచెడ్ మండలం ఫైజాబాద్‌లో జరిగింది.

ఫాదర్స్ డే రోజే దుర్ఘటన.. అనాథగా మారిన కూతురు
చిల్‌పచెడ్, జూన్ 21: ఫాదర్స్ డే రోజే తండ్రి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిల్‌పచెడ్ మండలం ఫైజాబాద్‌లో జరిగింది. ఫైజాబాద్ గ్రామానికి చెందిన గనోరే అమర్‌నాథ్(38) జోగిపేటలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి ఆయన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తుండగా.. చిల్‌పచెడ్‌లో రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. మృతుడి భార్య కూడా ఆరేళ్ల క్రితమే మరణించారు. దీంతో వారి కూతురు కాత్యాయిని (8) అనాథగా మిగిలింది.