నెల రోజుల క్రితం పెళ్లి.. ఆషాడానికి వెళ్లిన భార్య.. ఇంతలోనే ఘోరం..

ABN , First Publish Date - 2020-07-15T15:28:33+05:30 IST

పెళ్లయిన నెల రోజులకే అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం

నెల రోజుల క్రితం పెళ్లి.. ఆషాడానికి వెళ్లిన భార్య.. ఇంతలోనే ఘోరం..

అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

పెళ్లయిన నెల రోజులకే విషాదం


భీమదేవరపల్లి(వరంగల్) :  పెళ్లయిన నెల రోజులకే అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం శివారు అవలాదర్‌పల్లిలో  ఈ విషాదం చోటు చేసుకుంది. ముల్కనూర్‌ ఏఎస్సై రాజిరెడ్డి వివరాల మేరకు..  అవలాదార్‌పల్లికి చెందిన ఒల్లాల రాజు (26)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా గతేడాది మరో మూడెకరాల భూమి కొనుగోలు చేశాడు. దీంతో రూ. 5 లక్షల అప్పులు చేశాడు. జూన్‌  14న ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన యువతిని రాజు వివాహం చేసుకున్నాడు. అప్పుల బాధ తీర్చలేక పెళ్లి జరిగిన నెల రోజులకే రాజు పురుగుల మందు తాగి మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఆషాడమాసం కావడంతో పుట్టింటికి వెళ్లగా రాజు తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్‌ ఏఎస్సై రాజిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-07-15T15:28:33+05:30 IST