వాహనానికి సైడ్‌ ఇవ్వలేదని ఇద్దరు యువకులపై దాడి

ABN , First Publish Date - 2020-09-29T16:01:14+05:30 IST

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఆల్విన్‌కాలనీలో గ్యాస్‌ సరఫరా చేసే ఇద్దరు యువకులపై దాడి జరిగింది. ఇండియన్‌ గ్యాస్‌ సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న

వాహనానికి సైడ్‌ ఇవ్వలేదని ఇద్దరు యువకులపై దాడి

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఆల్విన్‌కాలనీలో గ్యాస్‌ సరఫరా చేసే ఇద్దరు యువకులపై దాడి జరిగింది. ఇండియన్‌ గ్యాస్‌ సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్న సతీష్‌, శాంతి అనే ఇద్దరు యువకులపై ఆల్విన్‌కాలనీ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొందరు యువకులు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. ఆకతాయిల వాహనానికి సైడ్‌ ఇవ్వలేదన్న కారణంగానే ఈ యువకులపై దాడి చేసినట్టు జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-29T16:01:14+05:30 IST