కాంగ్రెస్ నేత మల్లు రవి ఓటు గల్లంతు
ABN , First Publish Date - 2020-12-01T18:19:01+05:30 IST
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఓటు గల్లంతు కావడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఓటు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఓటు గల్లంతైంది. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పలు చోట్ల పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. జియాగూడ పోలింగ్ బూత్ నెం.38లో ఓట్లు గల్లంతవడం కలకలం రేపుతోంది. మొత్తం 914 ఓట్లకు 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఆన్‌లైన్ ఓటర్ లిస్ట్‌లో ఓటు ఉన్నా.. పోలింగ్ బూత్ వద్ద లిస్ట్‌లో చూపించడం లేదని ఓటర్ల ఆందోళనకు దిగారు. ఓటర్ స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.