వీహెచ్‌ వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి

ABN , First Publish Date - 2020-12-26T22:54:52+05:30 IST

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నారన్న నేపథ్యంలో ఆయనపై, రాష్ట్ర వ్యవహారాల..

వీహెచ్‌ వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి

హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనున్నారన్న నేపథ్యంలో ఆయనపై, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడిపై, సహచర నేతలపై మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే  వీహెచ్‌ వ్యాఖ్యలను మాజీ ఎంపీ మల్లు రవి ఖండించారు. ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేశారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వాలని బహిరంగంగానే చెప్పా.. చెంచాగిరీ ఏముందని వీహెచ్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై విమర్శలు చేయడమంటే అధిష్ఠానంపై చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికీ ఏ పదవి ఇవ్వాలో అధిష్ఠానానికి తెలుసునని మల్లు రవి  పేర్కొన్నారు.

Updated Date - 2020-12-26T22:54:52+05:30 IST