పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వాలి: మల్లు రవి

ABN , First Publish Date - 2020-11-28T00:56:23+05:30 IST

పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత

పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వాలి: మల్లు రవి

హైదరాబాద్: పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌ను మార్చే అవకాశముందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మల్లు రవి ప్రకటించారు.


ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ ఆ పార్టీలోని కొంత మంది సీనియర్లు అడ్డుపడుతున్నారు. బహిరంగంగా కూడా ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more