ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి

ABN , First Publish Date - 2020-04-24T09:56:16+05:30 IST

‘‘కరోనా రూపంలో పెను ప్రమాదం పొంచి ఉంది, చేతులు జోడించి చెబుతున్నా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలి’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి

సూర్యాపేటను చూసైనా నేర్చుకోవాలి: భట్టి 


మధిర టౌన్‌/ హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్‌ 23: ‘‘కరోనా రూపంలో పెను ప్రమాదం పొంచి ఉంది, చేతులు జోడించి చెబుతున్నా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలి’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా మధిరలోని కూరగాయల మార్కెట్‌, ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఆయన సొంత ఖర్చులతో పెడల్‌ హ్యాండ్‌ వాష్‌, శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట అనుభవాలను చూసైనా ప్రజలు ప్రభుత్వాల నిర్ణయాలకు సహకరించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దన్నారు.


అనంతరం మధిర సేవాసమితి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రధాని రిలీఫ్‌ ప్యాకేజీ కింద తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని భావించవచ్చా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని టీపీసీసీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని కిషన్‌రెడ్డిని కోరారు. కరోనా వార్తలను కవర్‌ చేసే విలేకరులకు బీమా సౌకర్యం కల్పించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-04-24T09:56:16+05:30 IST