నిస్వార్థ ప్రజా సేవకుడు గుండా మల్లేశ్‌

ABN , First Publish Date - 2020-11-07T07:26:27+05:30 IST

బొగ్గుగని కార్మికునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి నిస్వార్థ ప్రజా సేవకునిగా ప్రజల గుండెల్లో గుండా మల్లేశ్‌ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని సీపీఐ

నిస్వార్థ ప్రజా సేవకుడు గుండా మల్లేశ్‌

చాడ

హైదరాబాద్‌, నవంబర్‌ 6(ఆంధ్రజ్యోతి): బొగ్గుగని కార్మికునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి నిస్వార్థ ప్రజా సేవకునిగా ప్రజల గుండెల్లో గుండా మల్లేశ్‌ సుస్థిర స్థానం సంపాదించుకున్నారని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మక్దూంభవన్‌లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్లేశ్‌ సంస్మరణ సభలో చాడ  మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఆయన నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు. 


బొగ్గు గని కార్మికుడిగా తన ఉద్యోగ ప్రస్థానంతో..  సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడిగా, సీపీఐ జాతీయ సభ్యునిగా, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా అందరి మన్ననలు అందుకున్నారన్నారు. మల్లేశ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Updated Date - 2020-11-07T07:26:27+05:30 IST