ఏసీబీ డైరెక్టర్‌గా మల్లారెడ్డి
ABN , First Publish Date - 2020-12-05T08:35:53+05:30 IST
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా విశ్రాంత ఐజీ బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల
తెలంగాణ విశ్రాంత ఐజీకి ఏపీలో కీలక పోస్టు
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌గా విశ్రాంత ఐజీ బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని జగన్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జీఓలో పేర్కొంది. తెలంగాణలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏండీగా పనిచేసిన ఆయన 2 నెలల క్రితం పదవీ విరమణ చేశారు.
వైఎ్‌సతో సన్నిహిత సంబంధాలు కలిగిన మల్లారెడ్డిని జగన్ ప్రభుత్వం ఏసీబీలో కీలకమైన స్థానంలో నియమించడం విశే షం. నాలుగైదు రోజుల్లో ఆయన బాధ్యత చేపట్టనున్నట్లు సమాచారం. అయితే పొరుగు రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అధికారిని కీలక పోస్టులో కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు? అంటూ పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు.