మాకవేవీ వద్దు.. నగరాన్ని మంచిగా పెట్టండి: విశ్వేశ్వర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-21T21:51:58+05:30 IST

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తప్పుపట్టారు...

మాకవేవీ వద్దు.. నగరాన్ని మంచిగా పెట్టండి: విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తప్పుపట్టారు. ‘కేసీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తాం. సింగపూర్ చేస్తామన్నారు. మాకవేవీ వద్దు.. నగరాన్ని మంచిగా పెట్టండి అది చాలు’ అని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. వర్షం పడితే నీళ్లు పడక, నిప్పులు పడుతాయా అంటూ.. ఇటీవల ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. వరదలో చిక్కుకుపోయి మృతి చెందిన నవీన్ కుటుంబానికి రూ.50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-09-21T21:51:58+05:30 IST