ఫిబ్రవరిలో మహాపాదయాత్ర: రెడ్డి జేఏసీ
ABN , First Publish Date - 2020-12-27T08:20:19+05:30 IST
రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన వారి(ఈడబ్ల్యూఎ్‌స)కి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి జేఏసీ జాతీయ

బర్కత్‌పుర, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన వారి(ఈడబ్ల్యూఎ్‌స)కి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు నవల్గ సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
ఇందుకోసం వచ్చే ఫిబ్రవరిలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు ఐదు జిల్లాల మీదుగా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం విలేకరుతో ఆయన మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.