మహంకాళేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న నాయిని

ABN , First Publish Date - 2020-07-15T21:24:36+05:30 IST

బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం మిరాలం మండి మహంకాళేశ్వరి దేవాలయంలో శాకాంబరీ అలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు.

మహంకాళేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న నాయిని

హైదరాబాద్: బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం మిరాలం మండి మహంకాళేశ్వరి దేవాలయంలో శాకాంబరీ అలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. నిజాం కాలం నుండి నగరంలోని ప్రజలకు అన్ని రకాల కూరగాయల సరఫరాకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి  చెందిన మిరాలం మండిలో ప్రతి సంవత్సరం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ రోజు మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


Updated Date - 2020-07-15T21:24:36+05:30 IST