జూరాల ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-08-20T14:21:54+05:30 IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

జూరాల ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 39 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 318.080 అడుగులకు చేరింది.  అలాగే ప్రస్తుత నీటి నిల్వ 8.770 టీఎంసీలకు గాను... పూర్తిస్థాయి 9.657 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్‌ఫ్లో 3,30,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,34,087 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2020-08-20T14:21:54+05:30 IST