తహశీల్దార్‌ ఆఫీసు వద్ద బైఠాయించిన రైతు

ABN , First Publish Date - 2020-12-19T17:15:18+05:30 IST

ఓ రైతు మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించాడు.

తహశీల్దార్‌ ఆఫీసు వద్ద బైఠాయించిన రైతు

మహబూబ్‌నగర్ జిల్లా: తనకు న్యాయం చేయాలంటూ ఓ రైతు మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించాడు. ఆలూరుకు చెందిన రైతు చెన్నయ్యకు నాలుగు ఎకరాల 12 కుంటల భూమి ఉండగా.. అందులో అప్పులు తీర్చేందుకు ఎకరం అమ్మేశాడు. కానీ తన పేరుమీద కేవలం 9 కుంటల భూమి మాత్రమే ఉండడంతో రైతు ఖంగుతిన్నాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని  జరగకపోగా రూ. లక్ష ముట్టజెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు.. ప్రస్తుతం ధరణి వెబ్ సైటు కూడా తెరుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులంటున్నారు.

Read more