సీఎం కేసీఆర్‌ను కలిసిన పాలమూరు ప్రజా ప్రతినిధులు

ABN , First Publish Date - 2020-03-09T00:07:37+05:30 IST

బడ్జెట్‌లో పాలమూరు- రంగారెడ్డిఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు

సీఎం కేసీఆర్‌ను కలిసిన పాలమూరు ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్‌ : బడ్జెట్‌లో పాలమూరు- రంగారెడ్డిఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించినందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యావ్‌, అంజయ్యయాదవ్‌ తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ వల్ల ఉమ్మడిమహబూబ్‌నగర్‌ జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. 

Updated Date - 2020-03-09T00:07:37+05:30 IST