మధుకాన్‌ షుగర్స్‌ ఆధ్వర్యంలో రూ.1.5కోట్ల శానిటైజర్లు, మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-04-26T09:44:43+05:30 IST

కరోనా నుంచి ప్రజలను కాపాడే చర్యల్లో భాగంగా రూ.1.50 కోట్ల విలువైన..

మధుకాన్‌ షుగర్స్‌ ఆధ్వర్యంలో రూ.1.5కోట్ల శానిటైజర్లు, మాస్కుల పంపిణీ

  • మంత్రి కేటీఆర్‌తో ఎంపీ నామా, సంస్థ చైర్మన్‌ భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి ప్రజలను కాపాడే చర్యల్లో భాగంగా రూ.1.50 కోట్ల విలువైన ఇథనాల్‌ శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేసినట్లు మధుకాన్‌ షుగర్స్‌ చైర్మన్‌ నామా సీతయ్య, ఎండీ నామా కృష్ణయ్య తెలిపారు. సంస్థ వ్యవస్థాపకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు సారథ్యంలో నామా ముత్తయ్య మెమోరియల్‌ ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను శనివారం వారు మంత్రి కేటీఆర్‌ను కలిసి వివరించారు. కొవిడ్‌-19 సవాళ్లను ఎదుర్కోవడానికి మధుకాన్‌ షుగర్స్‌ ఆధ్వర్యంలో మొలాసిస్‌, ధాన్యాల నుంచి తీసిన ఇథనాల్‌ను మిక్సింగ్‌ చేసి శానిటైజర్లను తయారు చేసినట్లు తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం వీటిని రూపొదించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ రూ.1.50 కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్కులను తయారు చేసి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కరోనాపై పోరు లో సహకారం అందిస్తున్న రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఆర్‌కేఎస్సీ)కు శ్రీఇందూ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ చైర్మన్‌ వెంకట్‌రావు రూ.2.5 లక్షల విరాళం ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును రాచకొండ సీపీ మ హేశ్‌ భగవత్‌కు అందజేశారు. పీఎం కేర్స్‌కు ఏస్‌ ఇనిస్టిట్యూట్‌ రూ.15లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్‌ గోపాలకృష్ణ శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి చెక్కు అందజేశారు. 


కేటీఆర్‌కు రూ.1.25 లక్షల చెక్కు అందజేసిన టీఎ్‌సపీఎస్సీ 

కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌, సభ్యులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రూ.1.25 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్‌, చం ద్రావతి, మితినుద్దీన్‌ ఖాధ్రీ, సాయి ప్రగతి భవన్‌లో అందించారు. దీనికి అదనంగా చైర్మన్‌, సభ్యులు తలా 25 వేలు సీఎంఆర్‌ఎ్‌ఫకు అందించారు.

Updated Date - 2020-04-26T09:44:43+05:30 IST