ఎల్‌ అండ్‌ టీ మెట్రో రూ.3 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-05-10T09:33:09+05:30 IST

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి రూ.3 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులకు ....

ఎల్‌ అండ్‌ టీ మెట్రో రూ.3 కోట్ల విరాళం

2 కోట్లు ఇచ్చిన ఐటీసీ.. పోచంపాడు కన్‌స్ట్రక్షన్స్‌ రూ.కోటి


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 9(ఆంధ్రజ్యోతి): కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి రూ.3 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులకు సంబంధించిన పత్రాలను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. సీఎం సహాయనిధికి ఐటీసీ ఎండీ సంజీవ్‌ పురీ రూ.2 కోట్ల చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. పోచంపాడు కన్‌స్ట్రక్షన్స్‌ రూ. కోటి విలువైన పీపీఈ కిట్లను అందించింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలకు తెలంగాణ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఫెడరేషన్‌ రూ.36.71 లక్షలు, ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ పద్మజా చుండూ రు రూ.30 లక్షలు విరాళంగా అందించారు. ఈవెంట్స్‌ నౌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.28 లక్షల విరాళం ప్రకటించింది. తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ చిట్‌ఫండ్స్‌ ప్రెసిడెంట్‌ గాదె వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు ఇచ్చారు. టోల్‌ ప్లస్‌ ఇండియా లిమిటెడ్‌ రూ.25 లక్షలు, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.23లక్షలు, త్రిబుల్‌ లైన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.20 లక్షల చొప్పున సహాయం అందించారు. 

Updated Date - 2020-05-10T09:33:09+05:30 IST